
నవతెలంగాణ-పెద్దవంగర: కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, రెడ్డికుంట తండా సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రామచంద్రు తండాలో ఇంటింటికి కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలపై యూత్ నాయకులు ప్రచారం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రజలకు సేవ చేయడం కోసమే విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, యూత్ నాయకులు జాటోత్ వెంకన్న నాయక్, వినోద్ గౌడ్, ఏదునూరి లక్ష్మణ్, ఆవుల సతీష్, రామ్ చరణ్, శ్యామ్, అశోక్, ప్రశాంత్, సతీష్, రాజేష్, సుధాకర్, లాలు తదితరులు పాల్గొన్నారు.