సఫారీ పరుగుల సవారీ

 Safari run ride– డికాక్‌, మార్క్‌రామ్‌, డుసెన్‌ శతకాలు
న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ రికార్డులను తిరగరాసింది. డికాక్‌ (100), డుసెన్‌ (108), మార్క్‌రామ్‌ (106) శతకాలతో చెలరేగటంతో శ్రీలంకతో మ్యాచ్‌లో సఫారీలు ఏకంగా 428 పరుగులు చేశారు. ఐసీసీ ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు. ప్రపంచకప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు నమోదు కావటం సైతం ఇదే ప్రథమం. టాస్‌ నెగ్గిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ బవుమా (8) నిరాశపరిచినా.. డికాక్‌, డుసెన్‌లు రెండో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. డికాక్‌, డుసెన్‌ శతక జోరుకు మార్క్‌రామ్‌ సైతం జత కట్టడంతో శ్రీలంక బౌలర్లు తెల్లబోయారు. డికాక్‌ 83 బంతుల్లో, డుసెన్‌ 103 బంతుల్లో సెంచరీలు కొట్టగా.. మార్క్‌రామ్‌ ఏకంగా 34 బంతుల్లో శతక్కొట్టాడు. క్లాసెన్‌ (32), మిల్లర్‌ (39 నాటౌట్‌)లు రాణించారు. 50 ఓవర్లలో 5 వికెట్లకు దక్షిణాఫ్రికా 428 పరుగులు చేసి రికార్డులు బద్దలుకొట్టింది.