ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనమివ్వాలి

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీ. సాయిలు
నవతెలంగాణ- జోగిపేట
ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్‌ వేతనం రూ.18 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు డిమాండ్‌ చేశారు. ఆశా కార్యకర్తలు చేపట్టిన సమ్మె శనివారం 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా 24 గంటల నిరాహార దీక్షలను స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం ముందు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని కోరారు. 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. 20 ఏళ్లు వైద్య సేవలు అందిస్తున్న ఆశాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రమాద బీమా రూ.10 లక్షలు చెల్లించాలన్నారు. ఈనెల 9న హైదరాబాద్లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి డి. విద్యాసాగర్‌, ఆశా వర్కర్లు యూనియన్‌ జిల్లా కార్యదర్శి యశోద, జిల్లా సహాయ కార్యదర్శి సంగీత, నాయకురాలు మరియమ్మ గంగమ్మని, రేణుక, శిరీష, మానెమ్మ, సంతోష పరంజ్యోతి, అంజమ్మ, నందిని, లావణ్య పాల్గొన్నారు.
నవతెలంగాణ- జిన్నారం
ఆశా కార్మికుల సమ్మెను రాష్ట్రంలో మరింత ఉధతం చేస్తామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే రాజయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 9న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. . మండల కేంద్రమైన జిన్నారం లో కొనసాగుతున్న ఆశా కార్మికుల సమ్మె శిబిరాన్ని శనివారం ఆయన ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్మికుల పట్ల ప్రభుత్వం మొద్దు నిద్ర ను వీడి 13 రోజులు గా సమ్మె చేస్తున్న ఆశల పరిస్థితిని చూసి వెంటనే స్పందించాలన్నారు. పని గంటలతో సంబంధం లేకుండా ఫిక్స్డ్‌ వేతనం 18000 ఇవ్వాలని, పెర్మనెంట్‌ చేయాలని ఈఎస్‌ఐపిఎఫ్‌ ప్రమాద బీమా అమలు చేయాలని అన్ని రకాల సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఈ పోరాటం ఉధతం చేస్తామని హెచ్చరించారు.
న్యూ లాండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ సంఘీభావం
ఆశా కార్మికులకు న్యూ ల్యాండ్‌ పరిశ్రమ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ ప్రతినిధులు శనివారం సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
ఆశాల వంటావార్పు
13వ రోజు సమ్మెలో భాగంగా ఆశా కార్మికులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చిపోయే వారందరికీ తమ గోడును దీనంగా వెళ్ళబోసుకున్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్రీధర్‌ రావు, బి రవి, గోపాల్‌ రెడ్డి, హుస్సేన్‌, నాగరాజు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు..
ఆశాలను అడ్డుకున్న పోలీసులు
జిన్నారంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి వివిధ అభివద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు విచ్చేసిన సందర్భంగా తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాని కోరుతూ అటువైపుగా వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. తమ బాధలు ఎవరికి పట్టవా అంటూ ఆశా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం ఆశా వర్కర్ల బందం నాగమణి కే మంజుల ఎం సువర్ణ, ఎం అరుణ, గిరిజ, అంజలి, జ్యోతి, కష్ణవేణి, బుజ్జి, స్వప్న, మంజుల పాల్గొన్నారు.