లాటరీ తీశారు.. ఇండ్లు ఇవ్వడం మరిచారు

– కన్నీటి పర్యంతమైన బాధితులు
– మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళికి వినతిపత్రం
నవతెలంగాణ -గజ్వేల్‌
ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్‌ లో డబల్‌ బెడ్‌ రూమ్‌లు వచ్చిన భాదితులు శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ను రాజమౌళి ని కలిసి తమకు 7నెలల క్రితం లాటరీ ద్వారా వచ్చిన డబల్‌ బెడ్‌ రూమ్‌లు ఇవ్వాలని వినతి పత్రాన్ని చైర్మన్‌కు కమిషనర్‌కు అందజేశారు. ఎన్నో ఏళ్ళ నుండి కిరాయికి ఉంటున్నామని పిల్ల, పాపాలతో ఇంటి కిరాయి కట్టే పరిస్థితులలో లేమని, సొంతింటి కల ఎప్పుడు నెరవేరునని భాదితులు కన్నీటి పర్యంతంతో చైర్మన్‌ రాజమౌళి కి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి సానుకూలంగా స్పందించి వచ్చిన వారందరికీ డబల్‌ బెడ్‌ రూమ్‌ లు తొందరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ , మంత్రి హరీశ్‌ రావు దష్టికి తీసుకుపోతున్నామని ఆయన అన్నారు.