– దేశద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి
– కెేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్
నవతెలంగాణ-సంగారెడ్డి: వట్‌పల్లి మండలం ఉసిరికేపల్లి గ్రామంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన అగ్రకుల దురహంకారి ముంగే శ్రీకాంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి దేశద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానించడం అంటే దేశాన్ని అవమానించినట్టే అవుతుందన్నారు. దేశాన్ని అవ మానించిన దుర్మార్గులను దేశద్రోహులుగా గుర్తించి వారిని కఠినంగా శిక్షిం చాలన్నారు. ప్రపంచమంతా అంబేద్కర్‌ను కీర్తిస్తుంటే భారతదేశంలో కొందరు దు ర్మార్గులు మనువాదం ముసుగులో మహనీయుడు అంబేద్కర్ ను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యుడు మీద ఉమ్మేస్తే తిరిగి వారి మీదనే పడుతుందనే విషయం అగ్రకుల దురాంహాకారులు గ్రహించాలన్నారు. ముంగే శ్రీకాంత్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. దేశద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇటువంటి ఘటన లు పునరావతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నవతెలంగాణ-వట్‌పల్లి: అంబేద్కర్ విగ్రహం మీద మూత్ర విసర్జన చేసి అవమానించిన సంఘటన వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉసిరిక పల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకోవడంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. అంబేద్కర్ విగ్రహం మీద మూత్ర విసర్జన చేసిన అగ్రవర్ణ కులానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి దళిత జాతి మీద ఉన్న అక్రోషముతో అహంకారంతో దళితులంటే చిన్న చూపుగా భావించి మాల కించపరిచే విధంగా అంబేద్కర్ విగ్రహం మీద మూత్ర విచార్జన చేసి అవమానించిన వ్యక్తిపై అట్రాసిటి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో అల్లాదుర్గం జహీరాబాద్ రహదారి వట్పల్లి చౌరస్తాలో ధర్నా నిర్వహించిరాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కావడం వల్లనే నేడు బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల పుణ్యము లభించడంతోనే ఆర్థిక సమానత్వము లభించిందన్నారు. ధర్మస్థలానికి చేరుకొనిన పోలీసులు ఆందోళన చేపట్టిన దళిత సంఘాల నాయకులతో అంబేద్కర్ విగ్రహం మీద మూత్ర విసర్జన చేసిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుంటామని త్వరలోనే అతని పట్టుకొని అరెస్టు చేస్తామని దళిత సంఘాల నాయకులకు హామీనివ్వ డంతో ఆందోళన విరమించారు. 24 గంటల్లోగా అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉదతం చే స్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. అనంతరము అగ్రవ ర్ణ కుల వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి పై ఉసిరిక పల్లి గ్రామానికి చెందిన దళితులతో పాటు ప్రజా సంఘాల నాయకులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన దళిత సంఘాల నాయకులు మోహన్. విద్యాసాగర్. అనిల్. ప్రకాశం. జనార్ధన్. తదితరులు పాల్గొన్నారు.