రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేర్‌ రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆలేరు పట్టణంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్పు ,ఆలేరు శాసన సభ్యురాలు, గొంగిడి. సునీత మహేందర్‌ రెడ్డికి, రెవెన్యూ డివిజన్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో రెవెన్యూ డివిజన్స్‌ సాధన కమిటీ కన్వీనర్‌, పసుపు నూరి, వీరేశం, కోకన్వీనర్‌. మొరిగాడి. చంద్ర శేఖర్‌, మామిడాల. బిక్షపతి, ఎంఏ.ఎగ్బాల్‌, చెక్క. వెంకటేష్‌, ఉప్పలయ్య, పాల్గొన్నారు.