ఆలేరులో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం

నవతెలంగాణ-తుర్కపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులుగా తుర్కపల్లి మండలం పెడ్డతండా గ్రామానికీ చెందినా ధనావత్‌ భాస్కర్‌ నాయక్‌ ను, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తుర్కపల్లి మండలం మాదపూర్‌ గ్రామానికి చెందిన కొమ్మరి శెట్టి నర్శింహులు ఆదివారం నియమిస్తూ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జీ, బీర్ల అయిలయ్య నియామక పత్రం అంద జేశారు. నియామకానికి సహ కరించినా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ ఎనముల రేవంత్‌ రెడ్డి, భువనగిరి ఎంపీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, యాదగిరిగుట్ట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శ్రీ గుడిపాటి మధుసూదన్‌ రెడ్డి , ఆలేరు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఈసరపు యాదగిరి గౌడ్‌, ఆలేరు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ధనావత్‌ శంకర్‌ నాయక్‌ , మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడంట్‌ చాడ భాస్కర్‌ రెడ్డి, కత్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ నీ బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికలో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు కానుగంటి శ్రీనివాస్‌, ధనవత్‌ మోహన్‌ బాబు నాయక్‌, సర్పంచ్‌ బానోత్‌ బాబు నాయక్‌, ఎన్‌.ఎస్‌.యూ.ఐ నియోజక వర్గ అధ్యక్షులు గడ్డమిది నిఖిల్‌ గౌడ్‌, బిసి సెల్‌ అధ్యక్షులు రామగోని వెంకటేశ్‌ గౌడ్‌, ఎస్టీ సెల్‌ అధ్యక్షులు దీరవత్‌ పట్టు నాయక్‌, ఎస్సిసెల్‌ అధ్యక్షులు సొన్నయిల రఘు, మండల ఉపాధ్యక్షులు భూక్యా రాజారాం నాయక్‌,సుదర్శన్‌ గౌడ్‌, మాజీ సర్పంచ్‌ సోమల్ల వెంకటేశ్‌,నాయకులు సురేందర్‌ నాయక్‌, శివ గౌడ్‌, ప్రవీణ్‌, ఆగబుషి, విజరు నాయక్‌, సాగర్‌, నరేందర్‌ శంకర్‌, వెంకటేశ్‌, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.