అంతర్జాతీయ సదస్సుకు మంత్రులు

– కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అంతర్జాతీయ ఆహార భద్రత సదస్సుకు మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డికు ఆహ్వానం అందింది. ఈ నెల 24 నుంచి 26 వరకు అమోరికాలోని అయోవా రాష్ట్రం డెమోయిన్‌ నగరంలో జరగనున్న సదస్సుకు వెళ్లనున్నారు. ప్రపంచ దేశాల నుంచి 1200 మంది హాజరుకానున్నారు. ఆన్‌లైన్‌ మాధ్యమంలో భాగస్వాములు కానున్నారు. ఈనెల 22 నుంచి 29 వరకు మంత్రులు పర్యటించనున్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, తెలంగాణ సీడ్స్‌ ఎండీ డాక్టర్‌ కేశవులు తదితరులు మంత్రులతోపాటు వెళ్లానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పదేండ్ల తెలంగాణ వ్యవసాయరంగ ప్రగతి ప్రస్థానంపై మంత్రి కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌’ అధ్యక్షుడు టెర్రీ బ్రాన్‌ స్టాడ్‌ వారిని ఆహ్వానించారు. ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్‌ బోర్లాగ్‌ పేరు మీద ప్రతి ఏటా సదస్సులు జరగనున్నాయి.