– బస్సుయాత్రపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం సమావేశం కానుంది. అందులో అభ్యర్థుల ప్రకటన ఎప్పుడనేదానిపై కూడా చర్చించనుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర చేపట్టాలని భావిస్తోంది. అందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించనుంది.