– డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎలాంటి సంక్లిష్ట శస్త్ర చికిత్సలైనా నిమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తారని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. నిమ్స్ ఆస్పత్రి ఆడిటోరియంలో ఆదివారం ఆర్తో అంకాలజి సిపిడి-2023 కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు ఇక్కడికి వచ్చిన రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. జాయింట్ రీప్లేస్‌మెంట్, కిడ్నీ రీప్లేస్‌మెంట్ లాంటి చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని, ఇక్కడ ఉచితంగా సేవలను అందిస్తున్నట్టు చెప్పారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులతో అన్ని విభాగాల వైద్యులు ప్రత్యేక చొరవతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు.