సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో డైరెక్టర్స్ మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్, భరత్ కమ్మ నిర్మాత ఎస్కేఎన్, ఛారు బిస్కట్ శరత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ‘ఈ సినిమా ఇంత బాగా రూపుదిద్దుకోవడానికి మా ప్రొడ్యూసర్స్ కారణం. అలాగే ఇంత మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన దుశ్యంత్‌కు థ్యాంక్స్. లక్ష్మీ క్యారెక్టర్లో బాగా నటించింది నా కోస్టార్ శివానీ. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ ..ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ అవుట్ పుట్ సూపర్బ్‌గా ఇచ్చారు’ అని హీరో సుహాస్ చెప్పారు. డైరెక్టర్ దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ, ‘నాలాంటి ఒక కొత్త డైరెక్టర్‌కు జీఏ2 పిక్చర్స్‌లో మూవీ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. నాతో మూవీ చేసినందుకు సుహాస్‌కు థ్యాంక్స్ చెబుతున్నా’ అని తెలిపారు.