మాభూమి మాకే చెందాలి

నవతెలంగాణ-నిజాంపేట
మండల పరిధిలోని కే వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన దళిత కుటుంబాలకు సంబంధించి 12 ఎకరాల 20 గుంటల భూమిని గ్రామంలోని కొందరు భూ కబ్జా చేయడానికి చూస్తున్నారని దళిత యువకులు తెలిపారు. మాభూమి మాకే చెందాలని ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు రాని అమాయకులను చూసి అగ్రవర్ణాల వారు తమ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారన్నారు. చట్ట ప్రకారం 1975 సంవత్సరంలో సర్వేనెంబర్‌ 169లో విస్తీర్ణం ఏకరం 7-20 గుంటల భూమి , సర్వేనెంబర్‌ లో 170 విస్తీర్ణం 5 ఎకరాల భూమిని విస్తీర్ణం ఏ.12-20 గుంటల భూమిని సీలింగ్‌ ఆక్ట్‌ ప్రకారం వెంకటాపూర్‌ కే ,గ్రామానికి చెందిన దళిత కుటుంబాలకు ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రస్తుతం గ్రామానికి చెందిన అంజిరెడ్డి వారి వారసులు అక్రమంగా డబ్బు పలుకుబడితో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మహిళలు అని చూడకుండా భయభ్రాంతులకు గురిచేసి తమ భూములను ఖబ్జా చేసుకోవడానికి చూస్తున్నారన్నారు. ఇకనైనా అధికారులు1975 సీలింగ్‌ ఆక్ట్‌ ప్రకారం ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటున్న ఎ.12-20 గుంటల భూమిని తిరిగి కబ్జా చేయడానికి చూస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోకు వినతి పత్రం అందజేశామన్నారు. తమ భూములను కబ్జా చేయకుండా చూసి తమ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమం అసైండ్‌ భూ సమితి జిల్లా అధ్యక్షులు బైండ్ల నందు, జనగామ స్వామి, రాజేందర్‌, మహేందర్‌, మైసయ్య, నరసయ్య, దళిత కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.