మృతుని కుటుంబాన్ని పరామర్శచిన నాగజ్యోతి

నవతెలంగాణ -తాడ్వాయి : ములుగు జిల్లా జడ్పి చైర్ పర్సన్, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి బుధవారం మండలంలోని కాల్వపల్లి గ్రామంలో అకాల మరణం చెందిన సిద్దబోయిన సమ్మక్క  భౌతికకాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు, వారి కుటుంబ సభ్యులకు అండగా వుంటానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో  మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, గ్రామ అధ్యక్షులు పీరీల నరేష్, ఉప సర్పంచ్  ఆలేటి ఇంద్ర సేన రెడ్డి, మాజీ జడ్పీటీసీ సిద్దబోయిన వసంతరావు, బండారి చందయ్య,సీనియర్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.