నా లుక్‌కి మార్లిన్‌ మన్రో ప్రేరణ

To my look Marilyn Monroe inspiration– మెహరీన్‌
అర్నాబ్‌ రే రచించిన ‘సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ: అసెన్షన్‌’ పుస్తకం ఆధారంగా ‘సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ’ సిరీస్‌ను రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది. దీనికి సుపర్న్‌ వర్మ సహ-దర్శకత్వం, సహ-రచయిత. మిలన్‌ లుత్రియా తొలిసారిగా ఓటీటీ దర్శకుడిగా ఈ భారీ మాస్‌ ఎంటర్‌టైనర్‌తో అరంగేట్రం చేశారు. ఇది ఈనెల 13 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది. తాహిర్‌ రాజ్‌ భాసిన్‌, అంజుమ్‌ శర్మ, వినరు పాఠక్‌, నిశాంత్‌ దహియా, అనుప్రియ గో యెంకా, మౌని రారు, హర్లీన్‌ సేథీ, మెహరీన్‌ పిర్జాదా ముఖ్య పాత్రలు పోషించారు. తన పాత్ర గురించి మెహరీన్‌ మాట్లాడుతూ, ‘నా లుక్‌కి ఆడ్రీ, మార్లిన్‌ మన్రో ప్రేరణ. మిలన్‌ లుథ్రియా దర్శకత్వానికి సంబం ధించిన సిగేచర్‌ స్టైల్‌లలో ఇదొకటి. తను ప్రతి పాత్రకి ఓ ప్రత్యేక రూపాన్ని క్రియేట్‌ చేశారు. నేను పోషించిన సంజన పాత్ర లుక్‌ కోసం విగ్‌ ధరించాను. 50, 60ల నాటి దుస్తులే మంచి కూల్‌ లుక్‌ని ఇచ్చాయి. ఎంతో అమాయకత్వంతో ఉండే సంజన వంటి పాత్రకు తటస్థ రంగులు, సహజమైన మేకప్‌ కరెక్ట్‌ అని దర్శకుడు భావించారు. అందుకే నా లుక్‌ సింపుల్‌గా ఉంది’ అని చెప్పారు.