– ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తుండగా ప్రమాదం
బక్సర్ : ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న బక్సర్‌లో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది , సమాచారం ప్రకారం, రైలులోని ఒక బోగీ బోల్తా పడింది . రెండు ఏసీ కోచ్‌లు ట్రాక్‌పై నుంచి దూసుకెళ్లాయి. రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ అధికారులు, రిలీఫ్ రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.ఈ ప్రమాదంలో 70 మంది ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని అదికారులు తెలిపారు.
బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి గౌహతిలోని కామాఖ్య స్టేషన్‌కు వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఇక్కడ మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. హెల్ప్‌లైన్ నంబర్లు పీఎన్‌బీఈు 9771449971, డీఎన్‌ఆర్- 8905697493, ఏఆర్‌ఏ – 8306182542, సీఓఎంఎల్ – 7759070004 జారీ చేశారు.