నవతెలంగాణ – రాయపర్తి :
శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా అహర్నిశలు ప్రజల కోసం పనిచేసే పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి బందూకు వదిలి పలువుపార పట్టి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను కాంక్రీట్ తో పూడ్చారు. ఈ సందర్భంగా ఎస్సై దేశిని విజయ్ కుమార్ మాట్లాడుతూ రహదారిపై గుంతలు ప్రమాద స్థాయిలో ఏర్పాటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గుంతల కారణంగా అధిక సంఖ్యలో వాహనదారులు ప్రమాదాలకు గురై క్షతగాత్రుల మారుతున్నారని ఉపోద్ఘాటించారు. వాహనదారులు సైతం రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అన్నారు. పోలీసులు చేసిన పనికి వాహనాలు, స్థానిక ప్రజలు అభినందనలు తెలియచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సురేష్, కత్తులు శ్రీనివాస్, రవీందర్, సుమన్, సంపత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.