నవ తెలంగాణ- రామారెడ్డి :
వచ్చే ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న ప్రతి గజానికి రైతులకు పట్టాలనిందిస్తామని గురువారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. మండలంలో మద్దికుంటలో హాత్ సే హాజోడో యాత్ర నిర్వహించారు. శ్రీ స్వయం భూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మద్దికుంట లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ…. గజ్వేల్ కెసిఆర్ శకం ముగిసిందని, కామారెడ్డి లో భూములు ఆక్రమించడానికి వస్తున్నాడని, ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత జంగంపల్లి, అంబారిపేట్, గూడెం పరిసరాల్లో భూములను ఆక్రమించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను ముందు వరుసలో అమలు చేస్తామని, అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సాగౌడ్,జిల్లా మైనార్టీ సెల్ నాయకులు సల్మాన్, నాయకులు లచ్చిరెడ్డి, బండి ప్రవీణ్, పెండ్యాల నర్సారెడ్డి, గజ్జల చిన్నరాజు, అన్నారం దయానంద్, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.