నవతెలంగాణ-వీర్న పల్లి : వీర్నపల్లి మండల కేంద్రం అంబేద్కర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం విధ్యార్థులు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయా దుస్తులు ధరించి రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మ ను చిన్నారులు విధ్యార్థులు అలంకరించి అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు టి వకుళ, ఎస్ ఎం సి చైర్మన్ జోసెఫ్,ఉపాధ్యాయులు , విధ్యార్థులు తల్లి తండ్రులు పాల్గొన్నారు.