రాజస్థాన్‌లో మాదిరిగానే జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలి : టీడబ్ల్యూజేఎఫ్‌విజ్ఞప్తి

As in Rajasthan Postal ballot facility should be provided to journalists: TWF appealనవతెలంగాణ-హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్‌లో జర్నలిస్టులకు ఈ అవకాశం కల్పించారని గుర్తు చేసింది. ఎనిమిది శాఖలకు చెందిన సర్వీసు ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పిస్తూ రాజస్థాన్‌ ఎన్నికల సీఈవో నోటిఫికేషన్‌ జారీచేశారని తెలియజేసింది. మీడియా సిబ్బందిని సర్వీసు ఓటర్లుగా గుర్తించడం పట్ల ఫెడరేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎన్నికల విధుల్లోనే పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు, ఆర్మీ, పారామిలిటరీ సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునే సదుపాయం అమల్లో ఉందన్నారు. తెలంగాణలోనూ జర్నలిస్టులకు రాజస్థాన్‌లో మాదిరిగానే సర్వీసు ఓటర్లుగా గుర్తిస్తూ పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరారు.