
బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లి 5 సంవత్సరాలు కష్టపడి గల్ఫ్ నుండి ఇంటికి వచ్చేవరకు భార్య కనిపించకపోవడంతో భర్త షాక్ తిన్నాడు. సంఘటన మండలంలోని గోకుల్ తండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకుల్ తండాకు చెందిన మెగావత్ జ్యోతి గత 5 సంవత్సరాల నుండి కూతురుతో పాటు అత్తమామలతో కలిసి ఉంటుంది. గత ఐదు సంవత్సరాల క్రితం భర్త సుభాష్ బతుకుతెరువు కోసం గల్ఫ్ వెళ్ళాడు. గురువారం సాయంత్రం 7:30 నిమిషాలకు చీరలకు పాల్స్ కుట్టిస్తానని ఇంట్లో నుంచి వెళ్లిందని, అదే రోజు రాత్రి 8:00 గంటలకు ఇంటికి వచ్చిన భర్తకు, భార్య కనిపించకపోవడంతో బంధువుల ఇండ్లలో, చుట్టుపక్కల వెతికిన దొరకకపోవడంతో శుక్రవారం భర్త సుభాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు జరుపుతున్నట్లు ఏ ఎస్ ఐ సుభాషిని తెలిపారు.