ఆహ్వాన పత్రాలు ఆవిష్కరణ

నవతెలంగాణ జమ్మికుంట:
 జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్  పాఠశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో శిశు మందిర్ కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు  ఆధ్వర్యంలో స్వర్ణజయంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రబంధ కార్మి అధ్యక్షులు శీలం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పాఠశాల ఆవరణంలో ఆహ్వాన పత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు.   విద్యాసంస్థ 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని, అనేక ఒడిదుడుకులును ఓర్చుకొని, జమ్మికుంట చరిత్రలో అగ్రగామీ గా నిపించిన సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిరం అని, అలాంటి సంస్థ స్వర్ణ జయంతి భవనం నిర్మించుకొని సంబరాలు చేసుకున్న తరుణంలో విద్యా అభిమానులు, పూర్వా ఆచార్యులు, పూర్వ విద్యార్థులు, పూర్వ కమిటీ సభ్యులు, జమ్మికుంటపుర ప్రముఖులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారుఈ కార్యక్రమంలో సమితి అధ్యక్ష కార్యదర్శులు  ఆవల రాజారెడ్డి, ఆకుల రాజేందర్, ఆవాసం ప్రధానాచారి పొలసాని  సుధాకర్  రావు, కమిటీ సభ్యులు గుండా తిరుపతయ్య,  మామిడి ఐలయ్య, బచ్చు శివన్న, రావికంటి నీలకంఠం, రవీందర్,  మాధవరెడ్డి, బుర్ర శివయ్య, ప్రధానాచార్యులు గుడికందుల  సుదర్శన్ తదితరులు  పాల్గొన్నారు.