విద్యుద్ఘాతంతో రైతు మృతి

Farmer dies due to electric shockనవతెలంగాణ-పెద్దవూర
ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫీజు వేస్తుండగా విద్యుత్‌ సరఫరా కావడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ మీదనే అక్కడికక్కడే రైతు మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతునూర్‌ గ్రామానికి చెందిన పెండ్యాల నర్సింహారావు(67) తన వ్యవసాయ భూమిలో బోర్‌ మోటార్‌కు ట్రాన్స్‌ఫాÛర్మర్‌ నుంచి కరెంట్‌ రావడం లేదని ట్రాన్స్‌ఫార్మర్‌ను బందు చేసి వైర్లు జాయింట్‌ చేయడానికి పైకి ఎక్కి రిపేర్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగిలి చేతులు, కాళ్లకు, ఛాతిపై తీవ్ర కాలిన గాయలై అక్కడికక్కడే మరణించాడు. మృతుని భార్య పెండ్యాల సుమతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతునికి కుమారుడు ఉన్నాడు.