బిషక్ : కిర్గిజిస్తాన్‌తో సైనిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన కిర్గిజిస్తాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్‌తో ఆయన చర్చలు జరిపారు. జపరోవ్ పంపిన ఆహ్వానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోవియట్ అనంతర స్వతంత్ర కామన్వెల్త్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఆయన కిర్గిజ్ రాజధాని బిషక్ చేరుకున్నారు. రష్యా, కిర్గిజిస్తాన్‌ల మధ్య సైనిక, సైనిక-సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సి వుందని, విస్తరించుకోవాల్సి వుందని అన్నారు. రష్యా నేతృత్వంలోని పూర్వపు సోవియట్ రాష్ట్రాల కూటమి అయిన కలెక్టివ్ సెక్యూరిటీ ట్రియటీ ఆర్గనైజేషన్‌లో కిర్గిజిస్తాన్ భాగస్వామిగా వుంది. ఉక్రెయినియన్ చిన్నారులను బలవంతంగా తరలించినందుకుగాను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) పుతిన్‌ను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మార్చిలో పుతిన్ అరెస్టు వారంటు జారీ తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే.