విద్యుత్ హెచ్చుతగ్గులను బెరీజు చేసుకోవాలి సీజీఎం కిషన్

నవతెలంగాణ-ధర్మసాగర్ : రైతులు విద్యుత్ ప్రసారంలోని వచ్చే హెచ్చుతగ్గులను బేరీజు చేసుకొని వాడుకోవాలని ట్రాన్స్కో సిజిఎం ఆపరేషన్ 2 కిషన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో రైతులకు విద్యుత్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వారి అభ్యర్థన మేరకు మండలంలోని కొందరి రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మండుతున్న భానుడి ప్రతాపానికి వరి పంటలు ఎండకూడదని విద్యుత్ పై రైతులకు అవగాహన కల్పించేందుకు వారు వాడుతున్న విద్యుత్ విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పలు వ్యవసాయ బావులను సందర్శించి, విద్యుత్ హెచ్చు-తగ్గులను బేరీజు వేసి వినియోగం మోతాదుకు మించి ఉన్నందున విద్యుత్ కంట్రోల్ ఉపకరణాలను అమర్చుకోవాలని రైతులకు సూచించారు. వారానికొకసారి రైతులు స్టాటర్ డబ్బాలో బల్లులు చేరకుండా, సర్వీస్ వైర్ అతుకులు లేకుండా చూసుకోవాలని,అవసరం మేరకే విద్యుత్ వాడుకున్నట్లైతే సహరైతులకు సహకరించినవారౌతారని చెప్పారు.త్వరలోనే అదనపు ట్రాన్స్ఫార్మర్ కోసం సహకరిస్తానని తెలిపారు.ఈకార్యక్రమంలో ఏ డి ఈ రణధీర్ రెడ్డి, ఏడిఈ బొక్క దానయ్య,సబ్ ఇంజనీర్ శశికాంత్ నాయక్,ఫోర్మెన్ లక్ష్మన్ నాయక్, లైన్ ఇన్స్పెక్టర్ వెంకట్రాం రెడ్డి, స్థానిక లైన్మెన్ రమేష్, జేఎల్ఎం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.