కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారీటీకి కృషి చేస్తాం 

సంతోష్ గౌడుకు నియామక పత్రం అందజేస్తున్న నాయకులు
సంతోష్ గౌడుకు నియామక పత్రం అందజేస్తున్న నాయకులు
– గుగ్గీల్లలో గ్రామ నూతన కార్యవర్గం నియామకం 
నవతెలంగాణ-బెజ్జంకి 
మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం పాటుపడుతూ గుగ్గీల్లలో మెజారీటీకి కృషి చేస్తామని నూతనంగా నియామకమైన గ్రామశాఖ కార్యవర్గ సభ్యులు తెలిపారు. శనివారం మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామంలో మాజీ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ అధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ సభ్యుల నియామకం చేపట్టారు. ఈ సమావేశానికి రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక చేపట్టారు. గ్రామశాఖాధ్యక్షుడిగా తిప్పరవేణి బాబు..బీసీ, ఎస్సీ, కిసాన్ సెల్ అధ్యక్షులుగా తుడిశాల రాజశేఖర్, గుగ్గీల్ల మధు, దూసెట్టి రాజిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా నియామకమైన కార్యవర్గ సభ్యులకు నాయకులు నియామక పత్రమందజేశారు. నాయకులు రొడ్డ మల్లేశం, గూడెల్లి శ్రీకాంత్, మంకాల ప్రవీన్, బోయిని ప్రశాంత్, కార్యకర్తలు హజరయ్యారు.
మండల ప్రధాన కార్యదర్శిగా పులి సంతోష్…
కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని వడ్లూర్ గ్రామానికి చెందిన పులి సంతోష్ గౌడ్ నియామకమైనట్టు మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి తెలిపారు. మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ నాయకులు ఒగ్గు దామోదర్, రత్నాకర్ రెడ్డిలతో సంతోష్ గౌడుకు కరీంనగర్ యందు నియామక పత్రమందజేశారని నాయకులు తెలిపారు.