ఎవర్రా మీరంతా?
పంతులు గారు: ఏమయ్యా.. పెళ్లికి అక్షింతలు చల్లమంటే అందరూ కలిసి యూరియా చల్లుతున్నారు, ఏమిటయ్యా ఇదీ?
పెళ్లికొడుకు: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారుగా పంతులు గారూ.. అందుకే బాగా పండాలని నేనే ఇలా సెట్ చేశా!
అర్థాంగి అంటే
శిష్యుడు: గురువర్యా.. భార్యను అర్థాంగి అని ఎందుకు అంటారు?
గురువు: భర్తను సగం మాత్రమే అర్థం చేసుకొని, అతడి సగం జీవితం, బుర్ర పాడు చేస్తుంది కాబట్టి అర్థాంగి అంటారు నాయనా!
అవకాశం
సాయి : ఇంత చక్కగా వుంటావ్! మరి పెళ్లెందుకు చేసుకోవు.
కృష్ణ : భలేవాడివే! అమ్మాయిలతో డేటింగ్ చేసే సరదా ఎల్లప్పుడూ తీర్చుకునే అవకాశాన్ని వదులుకోమంటావా ఏమిటి?
పొడుగాటి పదం
టీచర్ : ఇంగ్లీషులో పొడుగాటి పదం ఏమిటి” అడిగాడు టీచర్.
విద్యార్థి : స్మైల్స్ (SMILES) టీచర్.
టీచర్ : అదెలా?
విద్యార్థి : మొదటి అక్షరానికి చివరి అక్షరానికి మధ్య ఒక మైలు వుంది కదా!