జూన్‌లో ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌

–  ఆరంభ సీజన్‌కు వేదికగా జైపూర్‌ సిటీ
న్యూఢిల్లీ : భారత క్రీడా విపణిలోకి మరో స్పోర్ట్స్‌ లీగ్‌ అడుగుపెట్టనుంది. ప్రీమి యర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) తొలి సీజన్‌ వచ్చే నెలలో ఆరంభం కానుంది. జూన్‌ 8-25 వరకు ప్రీమియర్‌ హ్యాండ్‌ బాల్‌ లీగ్‌ షెడ్యూల్‌ చేసింది. చారిత్రక అరంగ్రేట సీజన్‌కు పింక్‌ సిటీ జైపూర్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. జైపూర్‌లోని సవారుమాన్‌సింగ్‌ ఇండోర్‌ స్డేడియంలో ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. పీహెచ్‌ఎల్‌లో ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. రాజస్థాన్‌ పాట్రియాట్స్‌, గర్విట్‌ గుజరాత్‌, మహారాష్ట్ర ఐరెన్‌మెన్‌, గోల్డెన్‌ ఈగల్స్‌ ఉత్తర్‌ప్రదేశ్‌, తెలుగు టాలన్స్‌, ఢిల్లీ పంజర్స్‌లు తొలి సీజన్‌లో టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ ఏర్పాట్లపై శనివారం రాజస్థాన్‌ స్పోర్ట్స్‌కౌన్సిల్‌ అధ్యక్షురాలు కష్ణ పూనియా మాట్లాడారు.’జైపూర్‌ వేదికగా హ్యాండ్‌బాల్‌ లీగ్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌తో దేశీయ క్రీడాకారులకు గొప్ప లబ్ది చేకూరనుంది. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌తో జాతీయస్థాయిలో హ్యాండ్‌బాల్‌ మరింత ఆదరణ లభిస్తుంది’ అని పూనియా తెలిపారు.