దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి..

 – మోపాల్ ఎస్సై గంగాధర్
నవతెలంగాణ- మోపాల్: ఆదివారం నుంచి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావటం మూలంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు అందరూ తమ మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరించడం, అలాగే ఆదివారం సాయంత్రం ప్రతీ మండపం దగ్గరికి అమ్మ వార్లని ఊరేగింపుగా భక్తిశ్రద్ధలతో డప్పు వాయిద్యాల మధ్య తీసుకురావడం జరిగింది. మోపాల్ మండలంలోని దాదాపు 10 గ్రామాలకు పైబడి ఈ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మోపాల్ ఎస్సై గంగాధర్ నవతెలంగాణ తో మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావున మండలంలోని వివిధ గ్రామాల ఉత్సవ కమిటీ నిర్వాహకులు బాధ్యతగా ఉంటూ భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని అలాగే ఎటువంటి ఇబ్బందున్న 24 గంటలు తాము అందుబాటులో ఉంటామని ఏ అవసరం ఉన్న తమకు ఫోన్ చేయొచ్చని మన మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు శాంతియుతంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లోని యువకులందరూ భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని డీజే లాంటివి సౌండ్ సిస్టం ఎక్కువగా పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే పోలీస్ వారికి కూడా కచ్చితంగా సహకరించాలని మేమున్నది మీ శాంతి భద్రతలను కాపాడడం కోసమని ఆయన తెలిపారు.