వచ్చే ఎన్నికల తర్వాత మోడీ ఔట్‌

Modi out after the next election– ఇండియా కూటమి ఎన్నికల కూటమి కాదు : స్టాలిన్‌
చెన్నై : 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ఆదివారం తెలిపారు. చెన్నైలోని నందనం వైఎంసిఎ మైదానంలో డిఎంకె ఆధ్వర్యంలో జరిగిన మహిళా హక్కుల సదస్సులో స్టాలిన్‌ ప్రసంగించారు. 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉండదని అన్నారు. ఇండియా కూటమి అనేది కేవలం ఎన్నికల కూటమి కాదని, విధానపరమైన కూటమి అని తెలిపారు. వెనకబడిన తరగతుల మహిళలపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని స్టాలిన్‌ విమర్శించారు. అలాగే, మహిళా రిజర్వేషన్‌ బిల్లును ‘ఒక రహస్య ఉద్దేశ్యంతో’ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆరోపించారు. అన్ని మతాలు సమాన హక్కులు పొందాలని స్టాలిన్‌ స్పష్టం చేశారు.