
నవతెలంగాణ–బోడుప్పల్: ట్రాఫిక్ రూల్స్ తనకు పట్టవు అనుకున్నాడో ఎమో చట్టాలు చేసేది మేమే కదా అనుకున్నాడో ఎమోకానీ తన కారుకు రోడ్డుకు అడ్డంగా పార్కింగ్ చేసి జనాలను ఇబ్బంది పెట్టాడు. వివరాల్లోకి వెళితే బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకు ముందు TS08 FF 3933 నెంబరు కారును నడి రోడ్డుపై పార్కింగ్ చేయడంతో అటుగా వచ్చి పోయే వాహనాదారులకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మరీ ట్రాఫిక్ పోలీసులు దీనిపై స్పందించి చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి.