రేషన్ కార్డ్ దారులు ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలి

– జిల్లా పౌరసరపారుల శాఖ అధికారి తనూజ 
నవతెలంగాణ – సిద్దిపేట : జిల్లాలోని రేషన్ కార్డ్ దారులు ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని జిల్లా పౌరసరపారుల శాఖ అధికారి తనూజ సూచించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 2,91,525 రేషన్ కార్డులు ఉన్నాయని, 8, 95, 149 లబ్ధిదారులు ఉన్నారని, ఇందులో సుమారు ఐదు లక్షల మంది ఈ కేవైసీ చేసుకున్నారని అన్నారు.  రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ చేయించుకోవాలని చివరి తేదీ అంటూ ఏమీ లేదని అన్నారు.  ప్రభుత్వ సూచన ప్రకారము ఈకేవైసీ చేయించుకుంటే బాగుంటుందని సూచించారు.