హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ ట్రా’. రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ సోమవారం ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న రాజశేఖర్ సోమవారం సెట్స్‌లోకి అడుగు పెట్టారు. ఈ సడెన్ సర్‌ప్రైజింగ్ అనౌన్స్మెంట్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నితిన్ ఇందులో చాలా డిఫరెంట్‌గా కనిపించ బోతున్నారు. ఇదొక క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ, కచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పిస్తుందని డైరెక్టర్ వక్కంతం వంశీ తెలిపారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ అండ్ ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.