బ్యాంక్ లావాదేవిలపై అప్రమత్తంగా ఉండాలి

– టీజీబీ మేనేజర్ అనిల్ కుమార్ సూచన 
– సైబర్ నేరాలు, ప్రమాద భీమా పాలసీపై కళజాత ప్రదర్శన 
నవతెలంగాణ-బెజ్జంకి 
అధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోందని..ఖాతాదారులు తమ బ్యాంక్ లావాదేవిలపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అవరణం వద్ద సైబర్ నేరాలు,ప్రమాధ భీమా పాలసీలపై కళాకారులు కళజాత ప్రదర్శన నిర్వహించారు.డీజీటల్ లావాదేవిలతో పాటు వ్యాపార,పంట రుణాలు,ఫిక్సెడ్,రికరింగ్ డీపాజీట్ల సదుపాయాలు టీజీబీ బ్యాంక్ యందు అందుబాటులో ఉన్నాయని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. బ్యాంక్ సిబ్బంది సముద్రాల రాజు, ఖాతాదారులు, రైతులు హజరయ్యారు.