అవిలమల్లును పరామర్శిస్తున్న పిడమర్తి రవి..

నవతెలంగాణ – మద్దిరాల
ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కాల అవిలమల్లు ను మంగళవారం మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పిడమర్తి రవి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కూజా ఎల్లేష్, మారెల్లి మహేష్ తదితరులు ఉన్నారు.