– కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు
– ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం కుల్క చర్ల మండల కేంద్రంలోని విజయచంద్ర ఫంక్షన్ హా ల్లో కుల్కచర,్ల చౌడపూర్ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ…కాంగ్రెస్ పార్టీ చెప్పే 6 గ్యారెంటీ పథకాలను నమ్మి ఆగం కావద్దని బడుగు, బలహీన వర్గాల సంక్షే మానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరో మారు గెలిపించాలన్నారు. కుల్కచర్ల ముజాహిద్ పూర్, అడవి వెంకటాపూర్, దాస్య నాయక్ తండా లకు చెందిన పలువురు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ప్రధాన చౌరస్తా నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనిల్ రెడ్డి, ఎంపీపీ సత్యమ్మహరిశ్చందర్, జెడ్పీటీసీ రాందాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ బృంగి హరికృష్ణ, వైస్ ఎంపీపీ రాజశేఖర్ గౌడ్, కుల్కచర్ల, చౌడపూర్ మండలాల అధ్యక్షులు సేరి రాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పిఎసిఎస్ వై స్ చైర్మన్ నాగరాజు, రాజప్ప, కృష్ణయ్య గౌడ్, మఠం రాజశేఖర్, వెంకట్, సర్పంచులు ఎంపీటీసీలు కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.