కల్వకుర్తిలో ప్రతి ఎకరాకూ సాగు నీరందిస్తాం

– ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీధర్‌ రెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి
కాంగ్రెస్‌ అధికారంలో రాగానే కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని కాంగ్రెస్‌ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డి అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండల కేంద్రంలో దేవకి గార్డెన్లో కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు డోకూర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజకవర్గంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అభివద్ధి శూన్యం అని, నియోజకవర్గం అభివద్ధి కోసమే బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెెస్‌లో చేరినట్టు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రకటించిన మేనిఫెస్టోలో ఎన్ని అమలు పరిచారో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన 6గ్యారంటీలను బీఆర్‌ఎస్‌ కాపీ కొట్టిందని, కల్వకుర్తికి కంచుకోట అయిన కాంగ్రెస్‌ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. బీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు చిన్న మోహన్‌ రెడ్డి గత కొంత కాలంగా అసంతప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. వివిధ గ్రామాల బీఆర్‌ఎస్‌ నుంచి రాంపూర్‌ చిన్న హరి మోహన్‌ రెడ్డి, ఇస్రాయపల్లి యువకులు, వెల్జాల్‌ రాజు. మండల లారీ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గోవింద్‌ సైదులు ఉపాధ్యక్షులు తిరుపతి వివిధ గ్రామాల లారీ అసోసియేషన్‌ సభ్యులు 50 మంది, వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఠాగూర్‌ బాలాజిసింగ్‌, పీసీసీ సభ్యులు శ్రీనివాస్‌ గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు యాట నరసింహ, కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు మోహన్‌ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భగవాన్‌ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి అంజయ్య గుప్తా, రాష్ట్ర సేవాదళ్‌ కార్యవర్గ సభ్యులు దశరథం, డిసిసి కార్యదర్శి రవీందర్‌ యాదవ్‌, అసెంబ్లీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి అజీమ్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు జనార్దన్‌ రెడ్డి, మైనారిటీ మండల అధ్యక్షుడు ఆరిఫ్‌, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు చెన్నకేశవులు, కిసాన్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు విష్ణు, ఎన్‌ఎస్‌ యుఐ మండల అధ్యక్షులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.