నవతెలంగాణ- చండూరు
రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఇవిఎంల భద్రత, డిస్ట్రిబ్యూషన్, రిషిప్షన్ కేంద్ర ఏర్పాటుకు ప్రతిపాదిత భవనాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ పరిశీలించారు. మునుగోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఛండూర్ మండల కేంద్రం లోని డాన్ బాస్కొ జూనియర్ కళాశాల పరిశీలించి, చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు చేశారు. ఇవిఎంల భద్రతకు గదులు, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన చర్యల గురించి పరిశీలించారు. రిషిప్షన్ కేంద్ర ఏర్పాటు, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ల ఏర్పాటుపై చుట్టూ తిరిగి పరిశీలించారు. బ్యారికేడ్ల ఏర్పాటు విషయమై అధికారులకు సూచనలు చేశారు.. ఇవిఎం లు భద్ర పరచుటకు తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్, అదనపు ఇవిఎం లతో సహా భద్రపర్చడానికి సరియైన హాల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇవిఎం కమీషనింగ్ కి అనువైన హాల్ చూడాలన్నారు.ఈ నెల 20 న మొదటి ర్యాండ మైజేషన్ తర్వాత ఈ.వి.యం.లను అసెంబ్లీ నియోజక వర్గాలకు కేటాయించటం జరుగుతుందని అన్నారు. అనంతరం చండూర్ తహశీల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయం ను పరిశీలించారు. సువిధ సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు,సి.విజిల్ సెల్ పరిశీలించి,రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ ల స్వీకరణకు ఎన్నికల నిబంధనల ననుసరించి తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు.తర్వాత చండూర్ అర్.డి. ఓ కార్యాలయం ను సందర్శించారు. కార్యాలయం లో సహాయ వ్యయ పర్యవేక్షకులు, అకౌంటింగ్ టీమ్, వి.వి.టి టీమ్ లు వ్యయ పరిశీలనకు విధులు నిర్వరిస్తున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా చండూర్ అర్.డి. ఓ దామోదర రావు, తహశీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కరణ్, పి.అర్.డి.ఈ.రఘుపతి, ఏ.ఈ.రమేష్ తదితరులు ఉన్నారు.