యూడైస్ లో పేరుంటేనే పది పరీక్షలకు అనుమతి

– జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – సిద్దిపేట
యూడైస్లో పేరుంటేనే పది పరీక్షలకు అనుమతనీ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లా లోని అన్ని యాజమాన్యాల, ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2024 మార్చి/ ఏప్రిల్ నెలలో జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరై విద్యార్థుల పేరు, పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం (యూడైస్) లో నమోదై ఉంటేనే పదో తరగతి పరీక్షలకు అనుమతి ఇస్తారనీ తెలిపారు. పది పరీక్షలకు ఫీజు చెల్లించిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి విద్యార్థుల పేర్లు, ఇతర సమగ్ర వివరాలతో కూడిన నామినల్ రోల్స్ పంపిస్తాయనీ,  అనుమతి లేని పాఠశాలల్లో చదివే  పిల్లలను మరో బడి నుంచి పరీక్షలు రాయిస్తున్నారనీ,  దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఇప్పటి నుంచి యూడైస్ లో పేరు ఉంటేనే పదో తరగతి పరీక్షలకు అనుమతి ఇస్తారనీ తెలిపారు. ఈ నెల 28లోపు యూడైస్ పోర్టల్ లో విద్యార్థుల డేటాను ఆధునికీకరించాలని, దాన్నే నామినల్ రోల్స్ పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.