తమ్మి.. తొందరపడొద్దూ..?

– పార్టీలు మారేవారికి బుజ్జగింపులు
– గెలిసేది మనమే….కండువాలు మార్చొద్దు
నవతెలంగాణ- మల్హర్ రావు
ఎన్నికల సమయంలో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అలకబూనడం సహజమే. వారిని బుజ్జగించాల్సింది అభ్యర్థులే. ఎంత చిన్న వ్యక్తి అయినా అభ్యర్థి స్వయంగా అలకబూనిన నాయకుని వద్దకు వెళ్లి నెనున్నానని భరోసా ఇవ్వాల్సిందే. తమ్మి వచ్చేది మన ప్రభుత్వమే గెలిసేది మన అభ్యర్డే తొందరపడి పార్టీలు మారోద్దు.. మీకు ఎం కావాలో మాతో చెప్పండి చేద్దామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు, బీ అభ్యర్థుల అనుచరులు అలకపూసిన ద్వితీయ, తృతీయ నేతలను బుజ్జగించే పనిలో నిమగ్నమైయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి , మరికొందరు బిజెపిలోకి వలస వెళుతున్నారు. ఉదయం ఓ పార్టీలో చెరి సాయంత్రం సొంత గూటికి వస్తున్నారు.సాధారణ కార్యకర్తలు మొదలు కీలక నేతలు దాక కండువాలు మారుస్తున్నారు.
పైసలు ఇస్తావా.. పార్టీ మారాలా..
పార్టీల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న ప్రభుత్వం తనకు ఏ పదవులు ఇవ్వలేదని,సంక్షేమ పథకాల్లో మేము సూచించిన వారికి ఇవ్వలేదని కొందరు, ప్రత్యర్థి పార్టీలు ఆర్థిక ప్రలోభాలకు ఆకర్షితులై మరికొందరు కండువాలు మారుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఉన్న వాళ్ళను కాపాడుకోవడం, ఇతర పార్టీల వారికి గాలం వేయడం, వదిలి వెళ్ళిన వారిని మళ్ళీ సొంత గుటీకి తెచ్చుకోవడం లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు, అభ్యర్థులు వ్యూహాలను అమలు చేస్తున్నారు.