పవర్‌ఫుల్‌ కంటెంట్‌ ఉన్న కథ

A story with powerful contentరవితేజ, దర్శకుడు వంశీ కష్ణ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ అభిషేక్‌ అగర్వాల్‌ కాంబినేషన్‌లో రూపొం దిన పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ సినిమా ఈనెల 20న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, ‘ఒక దొంగ బయోపిక్‌ ఎందుకు చేశామో సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది. ఇది చాలా పవర్‌ ఫుల్‌ కంటెంట్‌ ఉన్న సినిమా. రవితేజ అద్భుతంగా సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా నా ఆల్‌ టైం ఫేవరేట్‌ మూవీగా నిలిచిపోతుంది. థియేటర్‌లో జీవీ ప్రకాష్‌ అందించిన నేపథ్య సంగీతాన్ని ప్రేక్షకులు చాలా ఎంజారు చేస్తారు. టెక్నిషియన్స్‌ అందరూ చాలా కష్టపడ్డారు. అందుకే ఇంత అద్భుతమైన అవుట్‌ కమ్‌ వచ్చింది. ఒకేసారి మూడు పెద్ద సినిమాలు పండక్కి రావడం సహజమే. తప్పకుండా మా సినిమాని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా కోసం జాతీయ అవార్డ్‌ అందుకున్నప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. వచ్చిన మూడేళ్ళలోనే నిర్మాతగా జాతీయ అవార్డు అందుకోవడం మా సంస్థకు ఎంతో గౌరవాన్ని తెచ్చింది. త్వరలో సర్‌ప్రైజ్‌ చేసే మరో బయోపిక్‌ అనౌన్స్‌ చేస్తున్నాం’ అని తెలిపారు.