ఆశీర్వదించండి.. అండగా ఉంటా 

– రేగులపల్లి ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే రసమయి 

నవతెలంగాణ- బెజ్జంకి 
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మండలాన్ని అభివృద్ధికి అనవాలుగా నిలబెట్టుకున్నామని..రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వాదించాలని..అందరికి అండగా ఉంటానని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేశారు.  బుధవారం మండల పరిధిలోని రేగులపల్లి గ్రామ సర్పంచ్ జెల్లా ఐలయ్య అధ్వర్యంలో ఆశీర్వాద సభ ఏర్పాటుచేశారు. ఈ సభకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హజరై మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటా చేర్చానని రాబోయే ఎన్నికల్లో మరోసారి అవకాశమివ్వాలని గ్రామ ప్రజలను కోరారు. మండల, గ్రామ బీఆర్ఎస్ నాయకులు,గ్రామస్తులు హజరయ్యారు.