– కౌంటింగ్ సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
స్ట్రాంగ్ రూములను కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. బుధవారం సూర్యాపేట లోని మార్కెట్ యార్డ్ నందు గల నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బికే, జిల్లా అదనప కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక ,ఏ వెంకటరెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ మెటీరియల్ స్వీకరణకు రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు, పోలింగ్ మెటీరియల్, పోలింగ్ బాక్సులు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూములను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. కౌంటింగ్ నిర్వహణకు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి కౌంటింగ్ ఏజెంట్లకు ప్రవేశం, బారికేడింగ్, కౌంటింగ్ వచ్చు సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, కౌంటింగ్ ఏజెంట్ల కు సంబంధించిన వాహనాల నిలుపుటకు పార్కింగ్ స్థలం, మీడియా రూమ్ ఏర్పాట్లపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వీర బ్రహ్మచారి తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు డిఎస్పి నాగభూషణం రాములు డిఎం మార్కెటింగ్ శర్మ డిఎంసి సప్లై రంపతి ఎలక్షన్ సూపర్డెంట్ శ్రీనివాసరాజు డిటి వేణు మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.రసంతంగా సాగుతున్న కబడ్డీ పోటీలు నవ తెలంగాణ మోతే దసరా పండుగ పురస్కరించుకొని మండల పరిధిలోని నామవరం గ్రామంలో జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న కబడ్డీ ఆటలు రసవత్తంగా సాగుతున్నాయి లీగ్ మ్యాచ్ లోకి కల్లూరు నడిగూడెం వచ్చాయి ఈ కార్యక్రమంలో నిర్వాకులు పాల్గొన్నారు.