సమావేశాకి కరెంటు అంతరాయం ..

– విద్యుత్ బిల్లు రీచార్జ్ చేసినా తర్వాత సరఫరా అయిన విద్యుత్..

నవతెలంగాణ- మునుగోడు
ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వ సభ సమావేశం గురువారం మునుగోడు మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 11 గంటలకు నిర్వహించే సర్వసభ్య సమావేశం ఆ కార్యాలయంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి గమనించిన మండల పరిషత్ అధికారులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు హుటాహుటిన మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి విద్యుత్ మీటను పరిశీలించడంతో విద్యుత్ రీఛార్జి చెల్లించకపోవడం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ అధికారులు తెలపడంతో మండల పరిషత్ అధికారులు విద్యుత్ రీఛార్జి చెల్లించడంతో 11 గంటల 48 నిమిషాలకు విద్యుత్ సరఫరా కావడంతో సమావేశం ప్రారంభమైంది.