విద్యార్థుల అభ్యున్నతికి ప్రాజెక్టు వర్కులు ఎంతో దోహదపడతాయి 

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
నవ తెలంగాణ – సిద్దిపేట:
విద్యార్థుల అభ్యున్నతికి ప్రాజెక్టు వర్కులు ఎంతో దోహదపడతాయనీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శ్రీ చైతన్య పాఠశాల రంగధాంపల్లి శాఖ ఎస్ బ్యాచ్ విభాగంలో చదువుతున్న శాన్విక్,  ప్రోగ్రాంలో భాగంగా దసరా‌ సెలవుల ప్రాజెక్టును చక్కగా చేసి మెదక్ ఎంపీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ప్రాజెక్టులు విద్యార్థుల్లో మానసిక అభ్యున్నతికి ఉపయోగపడతాయి అని అన్నారు. శ్రీ చైతన్య పాఠశాలలో ఎస్ బ్యాచ్ విభాగం గురించి విద్యార్థి వివరించగా, ఎంపీ  శ్రీ చైతన్య  పాఠశాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జ్యోతి రెడ్డి  మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధికి ఎస్ బ్యాచ్ ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందనీ అన్నారు.  శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, శ్రీవిద్య, ఆర్ ఐ రాజు, కోఆర్డినేటర్ నాయుడు, అకాడమిక్ డీన్ రాజేంద్రప్రసాద్ లు శాన్విక్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో

 ఎస్ బ్యాచ్ ఇంచార్జ్ హనుమాన్, సి బ్యాచ్ ఇంచార్జ్ అశోక్,  ప్రైమరీ ఇన్చార్జ్ మహాలక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ సరిత ,ఎఒ, పి ఈ టి లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.