‘ప్రజా ప్రభుత్వం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం’

నవతెలంగాణ-తలకొండపల్లి
ప్రజా ప్రభుత్వం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌, జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సిఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్‌ యాదవ్‌ తరపున తలకొండపల్లి మండల పరి ధిలోని చీపునుంతల, తుమ్మల కుంట తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటి ప్రచారం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సా ధ్యం అన్నారు. సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు తెలిపారు. మళ్లీ కారుగుర్తుకు ఓటేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్‌, మార్కెట్‌ ఛైర్మెన్‌ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్‌ మూజీబూర్‌ రహే మాన్‌, పార్టీ మండల అధ్యక్షుడు శంకర్‌, వర్కింగ్‌ ప్రె సిడెంట్‌ చంద్రశేఖర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్య క్షుడు నర్సింహ, మండల సర్పంచుల సంఘం అధ్యక్షు లు గోపాల్‌నాయక్‌, సర్పంచులు రఘుపతి, లక్ష్మణ్‌నా యక్‌, లలిత జ్యోతయ్య, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకటయ్య, జనార్దన్‌రెడ్డి, బాలకుమార్‌గౌడ్‌, దేవుళ్ల నాయక్‌, జగ న్‌రెడ్డి, నాగోజి, రమేష్‌నాయక్‌, రాజు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.