– ప్రకృతి వైఫరిత్యాలను ఎదుర్కోగలం
– నష్టాలను తగ్గించగల ప్రణాళికలు వేస్తాం
– ఆర్ఎంఎస్ఐ సస్టెనెబిలటీ ఎస్వీపీ పుష్పేంద్ర వెల్లడి
హైదరాబాద్ : గ్లోబల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్ దిగ్గజ సంస్థ ఆర్ఎంఎస్ఐ గ్రూపును మరింత విస్తరించనున్నట్లు ఆ సంస్థ సస్టెయినిబిలిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పుష్పేంద్ర జోహరి తెలిపారు. నోయిడాలోని కార్యాలయాన్ని మరో అంతస్తును పెంచుతున్నామన్నారు. కొత్తగా 500 మంది ఉద్యోగులను తీసుకోనున్నామని చెప్పారు. హైదరాబాద్‌ని హైటెక్స్‌లో వాతావరణంలో మార్పులపై జరిగిన జియోస్మార్ట్ ఇండియా సమావేశానికి హాజరైన జొహరి మీడియాతో మాట్లాడారు. ఆర్ఎంఎస్ఐ విస్తరణ ప్రణాళికలు కొనసాగుతున్నాయన్నారు. ప్రధానంగా మిడ్‌ల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. తమ వ్యాపారాలను కొత్త కోణాల్లో తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇందుకోసం టెలికం, లార్జ్ మ్యాపింగ్ కంపెనీలతో కలిసి పని చేయనున్నామన్నారు.
”ఆర్ఎంఎస్ఐ ప్రాథమికంగా ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలను అంచనా వేస్తుందన్నారు. నోయిడా కేంద్రంగా పని చేస్తోన్న మా సంస్థ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కార్యాలయాలను కలిగి ఉందన్నారు. ఆర్ఎంఎస్ఐలో ప్రపంచవ్యాప్తంగా 5వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 3వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మరో వెయ్యి మంది నోయిడాలో ఉన్నారు. విదేశాల్లో వెయ్యికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 40 దేశాలతో కలిసి పని చేస్తున్నాం. నోయిడా, హైదరాబాద్, డెహ్రాడూన్‌లో అభివృద్ధి కేంద్రాలను కలిగి ఉన్నాం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, మిడిల్ ఈస్ట్, బహ్రాన్‌లో అనుబంధ సంస్థలతో జియోస్పాటికల్ రంగంలో రాణిస్తున్నాం” అని జోహరి తెలిపారు. ఆర్ఎంఎస్ఐ క్రాపాలిటిక్స్ సబ్సిడీసంస్థ వ్యవసాయ పరిష్కారాలను అందిస్తుందని జోహరి తెలిపారు. ఈ తరహా స్టార్టప్ సంస్థను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు.
ఆర్ఎంఎస్ఐని మరింత విస్తరిస్తాం
1:32 am