నవతెలంగాణ- హాలియా: నవగణపతి యూత్ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా బొడ్రాయి బజార్ నందు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా దేవీ నవరాత్రులు జరుపుతామని ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో ఘనంగా దేవి నవరాత్రులు జరుగుతున్నాయని అన్నారు. ఈ నవరాత్రులకు మహా అన్నదానాన్ని దాతృత్వం వహించిన మంద నర్సిరెడ్డి, నరేందర్ రెడ్డి మంద బ్రదర్స్, విగ్రహ దాత కడారి అంజయ్య యాదవ్ కి కూడా కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని వారు అన్నారు. కార్యక్రమానికి కుందూరు జై వీర్ రెడ్డి, నవగణపతి యూత్ సభ్యులు పాల్గొన్నారు.