
– మద్నూర్ సంతోషిమాత ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు,
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల దేవీ సంతోషిమాత ఆలయంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిందే సతీ సమేతంగా దంపతులు శుక్రవారం నాడు ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు మొక్కుకుంటూ దేవి సంతోషిమాత మా దంపతులకు ఆశీర్వదించండి. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపుకు మీ ఆశీస్సులు ఇవ్వండి అంటూ ప్రత్యేక పూజలు జరిపారు ఈ ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే దంపతులతో పాటు ముగ్గురు కుమారులు కూడా పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబంతో పాటు మద్నూర్ బిచ్కుంద తదితర మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.