హయత్ నగర్ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఉమ ఇంట్లో సోదాలు

– 30 లక్షల  విలువైన బంగారు ఆభరణాలను గుర్తించిన అధికారులు
నవ తెలంగాణ – ముషీరాబాద్: గుర్రం గూడెంకు చెందిన జె.సుధాకర్ రెడ్డి తన ఇంటి నిర్మాణ పనుల అనుమతి కోసం హయత్ నగర్ టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించగా లంచం అడిగిన టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఉమ, సెక్షన్ అసిస్టెంట్ లక్ష్మణ్ లు ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఉమా నివాసముండే ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ వై జంక్షన్ ఎస్ కె పోర్ట్ అపార్ట్మెంట్ లో ఐదవ అంతస్తు 502 లో ఏ సి బి అధికారులు గురువారం రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో పత్రాలను పరిశీలించారు. సుమారు 30 లక్షల వరకు విలువైన బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు. అంతే కాకుండా ఆమె బ్యాంకులోని లాకర్ లో కూడా బంగారం ఉన్నట్లు సమాచారం. ఈ రైడ్స్ లో ఏ సి బి అధికారులు మార్టిన్ రిచర్డ్, మనోజ్, పూర్ణ చందర్ తదితరులున్నారు.