స్థానిక సత్య ఐ టి ఐ కళాశాలలో 1997 నుంచి 2023 వరకు చదివి విద్యుత్ సంస్థలలో వివిధ రకాల హోదాలో పని చేస్తున్న విద్యుత్ ప్రభుత్వ ఉద్యోగస్థులకు ఆ కళాశాల యాజమాన్యం సన్మానం సభ శుక్రవారం ఆ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్ఞాపికతో పాటు షాలువతో ఘనంగా సన్మానం చేశారు. పలువురు ఉద్యోగస్థులు మాట్లాడుతు ఇదే కళాశాలలో చదివి ఉద్యోగం సాధించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని, ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల అధ్యాపకులకు ప్రిన్సిపాల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాలేజీ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇక్కడ చదివి ఉద్యోగాలు సాధించడం కళాశాలకు మంచి పేరు ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. స్థానిక ఎస్సై సురేష్ మాట్లాడుతూ ఇంతటి విజయాన్ని సాందించిన ఉద్యోగస్థులకు, వారి అభివృద్ధికి, సహకరించిన యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చాలామందికి ఉపాధి కల్పించడం ఈ కళాశాల గొప్పదనం అన్నారు. ఈ కార్యక్రమంలో సత్య ఐటిఐ ప్రిన్సిపల్, డైరెక్టర్ చంద్రశేఖర్, మహేష్, వి.మల్లేష్, విజయ్, తీగల, వెంకటేశ్వర్లు, రామస్వామి, క్రాంతి, కృష్ణవేణి ప్రిన్సిపల్ ఆలీ వైస్ ప్రిన్సిపల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.